Aamir Khan | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రయోగాలు చేసే స్టార్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు అమీర్‌ఖాన్ (Aamir Khan). పీకే, దంగల్ సినిమాలతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సీక్రెట్ సూపర్ స్టార్ కాంపౌండ్ నుంచి మళ్లీ ఆ స్థాయి సినిమా రాలేదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అమీర్ ఖాన్ లీడ్ రోల్లో నటించిన లాల్ సింగ్ చడ్డా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చివరగా సలామ్ వెంకీ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశాడు.
ఇంతకీ మళ్లీ కొత్త సినిమాఎప్పుడని చర్చించుకుంటుండగా ఆసక్తికర వార్త బీటౌన్‌లో రౌండప్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం తన కుమారుడి సినిమాల కోసం ముంబైలో స్క్రిప్టులు వినే పనిలో బిజీగా ఉన్నాడట. అమీర్‌ఖాన్ సీనియర్ డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి (Raj Kumar Santoshi )తో సినిమా చేయబోతున్నాడన్న వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సోషల్ డ్రామా నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నాడట.
90స్లో అమీర్‌ఖాన్-రాజ్‌కుమార్ సంతోషి కాంబోలో Andaaz Apna Apna సినిమా వచ్చింది. చాలా సంవత్సరాల ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న తాజా ప్రాజెక్టులో అమీర్ ఖాన్ తన వయస్సుకు తగ్గ పాత్రలో కనిపించబోతున్నాడట. ఇదే నిజమైతే అమీర్‌ఖాన్ ఎలాంటి కథలో కనిపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వార్తలతో ఎంతోమంది కొత్త దర్శకులున్నప్పటికీ మంచి హిట్ అందుకోవాలంటే పాత డైరెక్టర్ అయితేనే పక్కా అని అమీర్ ఖాన్ గట్టిగానే ఫిక్సయ్యాడని నెట్టింట చర్చ నడుస్తోంది.
Thangalaan | తుఫాను వచ్చేస్తుంది.. విక్రమ్ తంగలాన్ అడ్వెంచరస్ రైడ్‌కు రెడీనా..?
NBK 109 | షూటింగ్ స్పాట్లో బాబీ.. బాలకృష్ణ ఎన్బీకే 109 డైరెక్టర్‌కు బర్త్ డే విషెస్