NBK 109 | టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ దర్శకుల్లో ఒకడు (Bobby) బాబీ (కేఎస్ రవీంద్ర). ఈ డైరెక్టర్ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ (Balakrishna)తో ఎన్బీకే 109 (NBK109) చేస్తున్నాడని తెలిసిందే. వెంకటేశ్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్రహీరోలతో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్న బాబీ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఎన్బీకే 109 షూటింగ్ స్పాట్లో బాబీతో ఉన్న స్టిల్‌ను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు సినిమాటోగ్రఫర్ విజయ్ కార్తీక్ కన్నన్. సెట్స్‌లో బాలకృష్ణ టీం బర్త్ డే కేక్ కట్ చేసి బాబీకి శుభాకాంక్షలు తెలియజేసింది.
ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక గ్లింప్స్‌లో మాన్స్టర్ వచ్చేశాడు… అంటూ బర్త్ డే గ్లింప్స్ విడుదల చేశారు. దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది. జాలి.. దయ కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు.. అంటూ సాగుతున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. గ్లింప్స్‌లో బాలయ్య చేతిలో గొడ్డలి పట్టుకొని జీపులో నుంచి దిగుతున్నట్టుగా ఉన్న విజువల్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీలో బాలకృష్ణ గూడ్స్ రైలు నుంచి రెండు బ్యాగులు పట్టుకుని పొగమంచు మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తున్న లుక్, ఇప్పటికే లాంఛ్ చేసిన ఎన్బీకే 109 ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. ఊర్వశి రౌటేలా పోలీసాఫీసర్‌గా కనిపించబోతుంది. చాందినీ చౌదరి కీలక పాత్ర పోషిస్తోంది.
Happy birthday bro @dirbobby 😊 ! #nbk109 pic.twitter.com/6tRgn3UKyv
— Vijay Kartik Kannan (@KVijayKartik) July 31, 2024
@dirbobby birthday celebrations from the sets of #NBK109 pic.twitter.com/AouzbSwHcB
— Nbk Tej ™ 🦁 (@NbkTej) August 1, 2024
Buddy | ఇంతకీ అల్లు శిరీష్ బడ్డీలో టెడ్డీబేర్ పాత్రలో నటించిందెవరో తెలుసా..?
Double iSmart | మాస్క్ లేకుంటే నీకు మిండెడు కనపడ్తడు.. డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో రామ్ డబ్బింగ్
ఎన్బీకే 109 బర్త్ డే గ్లింప్స్..
ఎన్బీకే 109 ఫస్ట్ గ్లింప్స్..