Devara | మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఒకటి దేవర (Devara). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్లో రోల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్నాడు. దేవర రెండు పార్టులుగా రాబోతుండగా.. పార్టు 1 సెప్టెంబర్27 న గ్రాండ్‌గా విడుదల కానుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపుతోంది కొరటాల టీం. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ తల్లి శ్రీదేవికి తగ్గ తనయగా పక్కా ప్రొఫెషనల్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
జాన్వీకపూర్ దేవర షూటింగ్ టైంను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. తన అభిమానులు, ఫాలోవర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసింది. దేవర షూటింగ్ బ్రేక్‌లో లంచ్ టైంలో పసందైన విందు భోజనం ఫొటోను అందరితో పంచుకుంది. డైనింగ్ టేబుల్‌పై బిర్యానీ, చికెన్, డిషెస్తోపాటు పలు శాఖాహార వంటకాలున్న స్టిల్ షేర్ చేస్తూ.. దేవర షూటింగ్‌ను ఇందుకే ప్రేమిస్తున్నానంటూ ఫైర్, లవ్ ఎమోజీలను క్యాప్షన్‌గా ఇచ్చింది. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం శంషాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్లో జాన్వీకపూర్, తారక్, ఇతర ఆర్టిస్టులపై వచ్చే భారీ సాంగ్‌ను చిత్రీకరిస్తోంది కొరటాల శివ అండ్ టీం. దేవర షూటింగ్‌ను జెట్ స్పీడ్‌లో పూర్తి చేసి అనుకున్న సమయానికి విడుదల చేసేందుకు కొరటాల టీం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దేవర నుంచి అనిరుధ్ రవిచందర్ కంపోజిషన్‌లో విడుదలైన ఫియర్ సాంగ్ (fear song)తోపాటు గ్లింప్స్ నెట్టింటిని షేక్ చేస్తూ.. మిలియన్లకుపైగా వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Devara1
Double iSmart | మాస్క్ లేకుంటే నీకు మిండెడు కనపడ్తడు.. డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో రామ్ డబ్బింగ్
Game Changer | బర్త్ డే గాళ్ కియారా అద్వానీకి శుభాకాంక్షలు.. ట్రెండింగ్‌లో గేమ్ ఛేంజర్ నయా లుక్
They Call Him OG | ఏంటీ పవన్ కల్యాణ్ మేకప్ వేసుకునే టైం వచ్చేసిందా..? ఓజీ షూట్‌పై క్రేజీ న్యూస్
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్