Double iSmart | టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను స్పీడప్ చేసింది రామ్ టీం. ఇప్పటికే కీ రోల్ చేస్తున్న సంజయ్ దత్ డబ్బింగ్ పూర్తయినట్టు తెలియజేశారు మేకర్స్. తాజాగా హీరో రామ్ కూడా తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ వీడియో షేర్ చేశారు. డబ్బింగ్ స్టూడియోలో ఉన్న రామ్.. రెడీనా..? మామా మాస్క్ ఉంటే నీకు దొంగోడు మాత్రమే కనబడతడు.. మాస్క్ లేకుంటే నీకు మిండెడు కనపడ్తడు.. అంటూ రామ్ డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో చెబుతున్న మాస్ డైలాగ్స్ అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని చెప్పకనే చెబుతున్నాడు.
డబుల్ ఇస్మార్ట్ మాస్ మ్యూజిక్ జాతరలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన STEPPAMAAR, మార్ ముంతా చోడ్ చింతా సాంగ్ పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇస్మార్ట్ శంకర్‌లో పాపులర్ అయిన మార్ ముంతా చోడ్ చింతా డైలాగ్‌నే సాంగ్‌గా పెట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు పూరీ.
ధిమాక్కిరికిరి అంటూ సాగే డబుల్ ఇస్మార్ట్ టీజర్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఇస్మార్ట్ శంకర్‌కు స్పీకర్లు దద్దరిల్లిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయబోతున్నట్టు అర్థమవుతోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది.
READY READY READY 🥳
Ustaad #Doubleismart Shankar’s MENTAL MASS MADNESS from AUGUST 15th 😎🔥#DoubleIsmartOnAug15 https://t.co/htEutKtqQ4
— Puri Connects (@PuriConnects) July 31, 2024
Game Changer | బర్త్ డే గాళ్ కియారా అద్వానీకి శుభాకాంక్షలు.. ట్రెండింగ్‌లో గేమ్ ఛేంజర్ నయా లుక్
They Call Him OG | ఏంటీ పవన్ కల్యాణ్ మేకప్ వేసుకునే టైం వచ్చేసిందా..? ఓజీ షూట్‌పై క్రేజీ న్యూస్
People Media Factory | రాజాసాబ్.. మిస్టర్ బచ్చన్.. లీడింగ్ బ్యానర్ లైనప్‌లో క్రేజీ చిత్రాలు
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్