People Media Factory | సినిమాకు బ్యాక్‌బోన్ కథ.. కథ బాగుంటే సినిమా ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్లో కథాబలమున్న సినిమాలు చేసే లీడింగ్ బ్యానర్లలో ఒకటి టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory). బ్రో, ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన ఈ టాప్ బ్యానర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వినోదాన్ని అందించేందుకు రెడీ అంటోంది.
ఓ వైపు కంటెంట్‌కు ప్రాధాన్యమిస్తూనే.. కమర్షియల్ ఎంటర్టైనర్లను తెరకెక్కిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ బ్యానర్ ఖాతాలో రవితేజ టైటిల్ రోల్లో నటిస్తోన్న మిస్టర్ బచ్చన్ (mr bachchan), ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ (rajasaab) తోపాటు మిరాయి, అడివి శేష్ G2 సినిమాలున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన మిస్టర్ బచ్చన్ టీజర్ మాస్ మహారాజా స్టైల్లో సాగుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది. మరోవైపు ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ గ్లింప్స్ కూడా అభిమానులకు కావాల్సిన ట్రీట్ ఇవ్వబోతున్నట్టు చెప్పకనే చెబుతోంది.
వీటిలోపాటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీడియోల్-గోపీచంద్ మలినేని కాంబోలో కూడా సినిమాను ప్రకటించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మొత్తానికి తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన పక్కా వినోదాన్ని అందించేందుకు టీజీ విశ్వప్రసాద్ టీం గట్టిగానే ఫిక్సయినట్టు అర్థమవుతుందంటున్నారు సినీ జనాలు.
Magadheera | రాంచరణ్ ల్యాండ్ మార్క్ మూవీ మగధీర @ 15 ఇయర్స్
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్