Jailer 2 | కోలమావు కోకిల, డాక్టర్, బీస్ట్, జైలర్ సినిమాలతో తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar). వీటిలో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో తెరకెక్కించిన జైలర్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతోపాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. జైలర్ 2 (Jailer 2) కోసం వెయిటింగ్ అంటూ నెట్టింట ప్రశ్నలతో హోరెత్తిస్తున్న మూవీ లవర్స్, అభిమానులకు యోగిబాబు గుడ్ న్యూస్ చెప్పాడు.
తాను జైలర్ 2లో కూడా మరోసారి కనిపిస్తానని చెప్పాడు యోగిబాబు. నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2లో నా పాత్రను ప్రత్యేకంగా నిలిచిపోయేలా స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడన్నాడు. అంతేకాదు ఫస్ట్ పార్టులో కనిపించిన మిర్నా మీనన్ సీక్వెల్లో కూడా నటిస్తున్నట్టు హింట్ ఇచ్చేసింది. ఈ రెండు అప్డేట్స్తో తలైవా నుంచి మరో బ్లాక్ బస్టర్ రెడీ అవుతుందని కన్ఫామ్ అవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
గతేడాది ఆగస్టు 09న రిలీజైన జైలర్ సుమారు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. జైలర్‌లో తమన్నా, సునీల్, రమ్యకృష్ణ, వసంత్ రవి, వీటీవీ గణేశ్‌తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
YogiBabu confirms his presence in #Jailer2 🔥
“Nelson is writing up something special for my character in Jailer2″🌟Superstar #Rajinikanth | #Nelson | #Anirudhpic.twitter.com/fLwq81OeYH
— AmuthaBharathi (@CinemaWithAB) July 29, 2024
Raja Saab | సూపర్ స్టైలిష్ రాజాసాబ్గా ప్రభాస్ ఎంట్రీ.. మారుతి గ్లింప్స్ అదిరిందంతే..!
Thug life | డబ్బింగ్ స్టూడియోలో కమల్‌హాసన్.. థగ్ లైఫ్ టీం కొత్త వార్త ఇదే..!
Double ISMART | డబుల్ ఇస్మార్ట్ రొమాంటిక్ మెలోడీగా రామ్, కావ్య థాపర్ Kya Lafda సాంగ్
Chiyaan Vikram | చియాన్ 63 డైరెక్టర్ ఫైనల్ అయినట్టే.. క్లారిటీ ఇచ్చేసిన విక్రమ్