Thug life | ఇటీవలే ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కమల్‌హాసన్ (Kamalhaasan). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఉలగనాయగన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా.. వీటిలో ఒకటి మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’ (Thug life). KH234గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఐశ్వర్యలక్ష్మి, త్రిష, ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరో శింబు, పాపులర్ మాలీవుడ్ యాక్టర్ జోజు జార్జ్, గౌతమ్ కార్తీక్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
చాలా రోజుల తర్వాత క్రేజీ వార్తను షేర్ చేశారు మేకర్స్. థగ్ లైఫ్ డబ్బింగ్ పనులు షురూ అయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ కమల్ హాసన్ డబ్బింగ్ స్టూడియోకు సంబంధించిన విజువల్స్ అందరితో పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే థగ్ లైఫ్ టీంతో కట్ చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్-ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక థగ్ లైఫ్‌లో శింబు పాత్ర ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ.. Sigma Thug Rule అంటూ విడుదల చేసిన వీడియోలో శింబు తన మార్క్ చూపించేందుకు ఇన్నోవాలో కొత్త క్రిమినల్ రూపంలో పిస్తోల్ చేతబట్టుకొని స్టైలిష్ ఎంట్రీ ఇస్తున్న విజువల్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
When #Ulaganayagan voices it, the World listens!#ThugsDubbingBegins #VoiceofThugs#KamalHaasan #ThugLife #SilambarasanTR@ikamalhaasan #ManiRatnam @SilambarasanTR_ @arrahman #Mahendran @bagapath pic.twitter.com/6acx8X82Fl
— Raaj Kamal Films International (@RKFI) July 29, 2024
Chiyaan Vikram | చియాన్ 63 డైరెక్టర్ ఫైనల్ అయినట్టే.. క్లారిటీ ఇచ్చేసిన విక్రమ్
Ram Pothineni | క్రేజీ న్యూస్.. రామ్, మహేశ్ బాబు మూవీ సెట్స్‌పైకి వెళ్లే టైం ఫిక్స్ ..!