Veera Dheera Sooran | విలక్షణ నటుడు ఛియాన్ విక్రమ్ (Vikram) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి తంగలాన్. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 15న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. మరోవైపు చిన్నా ఫేం ఎస్‌యూ అరుణ్‌కుమార్ Chiyaan 62 దర్శకత్వంలో ఛియాన్ 62ను కూడా చేస్తుండగా.. వీరధీరసూరన్ టైటిల్‌తో రాబోతుంది.
దీంతోపాటు గౌతమ్ వాసు దేవ్ మీనన్ డైరెక్షన్లో ధ్రువ నక్షత్రం: యుద్ద కాండంలో కూడా నటిస్తున్నాడు. పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమాలన్నీ ట్రాక్‌పై ఉండగానే చియాన్ 63కు సంబంధించిన హింట్ ఇచ్చి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు విక్రమ్. తంగలాన్ ప్రమోషనల్ ఈవెంట్లో విక్రమ్ మాట్లాడుతూ.. 2018 డైరెక్టర్ జ్యూడ్ ఆంథనీ జోసెఫ్‌తో నెక్ట్స్ సినిమా చర్చలు కొనసాగాయని చెప్పి.. చియాన్ 63 డైరెక్టర్ దాదాపు ఫైనల్ అయిపోయినట్టేనని క్లారిటీ ఇచ్చేశాడు విక్రమ్. రాబోయే రోజుల్లో అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని ఈ కామెంట్స్ చెప్పకనే చెబుతున్నాయి.
హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న తంగలాన్‌లో మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగే ఘటనల నేపథ్యంలో కట్ చేసిన ట్రైలర్ విక్రమ్ థ్రిల్లింగ్, అడ్వెంచరస్ రైడ్‌గా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
ఇక వీరధీరసూరన్లో విక్రమ్ పక్కా యాక్షన్ ప్యాక్డ్ కమర్షియల్ మూవీతో వస్తున్నాడని టీజర్ చెప్పకనే చెబుతోంది.
#Chiyaan63 Malayalam Director Last Year Big blockbuster Director Confirmation @Chiyaan 💥🤩😉
Manjummel Boys Than Eruku 👑🥁#Thangalaan #ChiyaanVikram #VeeraDheeraSooran pic.twitter.com/Nj38DreP1y
— chiyaan Suresh 🥰 (@sureshkrishan8) July 28, 2024
Mr Bachchan | ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు సార్.. రవితేజ మిస్టర్ బచ్చన్ టీజర్
Bad Newz | విక్కీ కౌశల్, తృప్తి డిమ్రి బ్యాడ్ న్యూజ్ మైల్స్టోన్
Kubera | బర్త్ డే స్పెషల్.. ధనుష్ కుబేర నయా లుక్ వైరల్