Kubera | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) డైరెక్ట్ చేస్తూ లీడ్ రోల్లో నటించిన రాయన్ మంచి టాక్ తెచ్చుకుంటోంది. డైరెక్టర్‌గా మంచి మార్కులు కొటేశాడు ధనుష్. కాగా ఈ స్టార్ హీరో బ్యాక్ టు బ్యాక్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండగా.. వీటిలో ఒకటి కుబేర (Kubera). D51గా తెరకెక్కుతున్న ఈ మూవీని టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్‌కమ్ముల (Shekhar Kammula) డైరెక్ట్ చేస్తున్నాడు. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
అక్కినేని నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది.. అనే క్యాప్షన్‌తో ఇప్పటికే షేర్ చేసిన చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తున్న ధనుష్ కుబేర ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. తాజాగా ధనుష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ..స్పెషల్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ధనుష్ గుబురు గడ్డం, మాసిన చొక్కాలో అమాయకంగా కనిపిస్తూ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు.
ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కుబేర ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. కొన్ని రోజుల క్రితం ముంబై షెడ్యూల్లో ధనుష్, రష్మిక మందన్నాపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మరోవైపు హైదరాబాద్‌లో ధనుష్, అక్కినేని నాగార్జున మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలను కూడా షూట్ చేశారు.
Wishing D man of versatility, D man of experiments @dhanushkraja sir a very happy birthday. ❤️🔥💥#SekharKammulasKubera #HappyBirthdayDhanush #Dhanush pic.twitter.com/aW008SZ7EA
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) July 28, 2024
Read Also :
Raayan Review | ధనుష్ రాయన్గా మెప్పించాడా.. పర్ఫెక్ట్ బెంచ్‌మార్క్ సినిమానా.. ?
Raayan | ధనుష్ రాయన్ స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ప్లాట్‌ఫాం ఇదే..!
SK23 | మురుగదాస్-శివకార్తికేయన్ ఎస్కే 23 టీం ఇప్పుడెక్కడుందో తెలుసా..?