Raayan | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటించిన చిత్రం రాయన్ (Raayan). నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. మాస్ సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్‌కు విజువల్ ట్రీట్‌లా ఉందని ఇప్పటివరకు వచ్చిన రివ్యూస్ చెబుతున్నాయి.
కాగా ధనుష్ అభిమానుల కోసం మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రాయన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం Sun NXT దక్కించుకుంది. మరి సన్ నెక్ట్స్‌లో ఎప్పుడు ప్రీమియర్ అవుతుందనే దానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. డీ50వ (D50)గా తెరకెక్కిన రాయన్ చిత్రంలో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, ఎస్జే సూర్య , కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషించారు.
రాయన్ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీని తెలుగులో ఏసియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ రిలీజ్ చేసింది.
Rashmika Mandanna | చీరకట్టులో రష్మిక మందన్నా రంజితమే స్టెప్పులు.. ట్రెండింగ్‌లో విజువల్స్
Vikramarkudu 4K | జక్కన్న విక్రమార్కుడు రీరిలీజ్ టైం.. రవితేజ కటౌట్ అదిరిందంతే
Skanda | యూట్యూబ్‌లో రామ్-బోయపాటి సునామి.. స్కందకు రికార్డు రెస్పాన్స్
Raayan Review | ధనుష్ రాయన్గా మెప్పించాడా.. పర్ఫెక్ట్ బెంచ్‌మార్క్ సినిమానా.. ?