Skanda | భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడం సాధారణంగా కనిపించేదే. అయితే థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయకున్నా.. ఓటీటీ, టీవీ, ఇతర ప్లాట్‌ఫాంలలో మంచి స్పందన రాబట్టుకున్నవి కూడా ఉన్నాయి. ఆ జాబితాలోకే వచ్చేసింది మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu), టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద (Skanda). గతేడాది సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది.
అయితే ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్లోకి ఎంట్రీ ఇచ్చిన స్కంద సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు టీవీలో కూడా (స్టార్ మా) స్కంద 8.11 టీఆర్పీని నమోదు చేసినట్టు కూడా వార్తలు వచ్చాయని తెలిసిందే. తాజాగా స్కంద హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ మైల్స్టోన్కు చేరుకుంది. అంతేకాదు యూట్యూబ్‌లో ప్రీమియర్ అయిన నెలలోనే 1.1 మిలియన్ లైక్స్ వచ్చాయి. స్కంద జూన్ 17న WamIndia Movies ఛానల్లో విడుదలైంది.
ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. స్కంద సీక్వెల్ కూడా రాబోతుండగా.. తాజా అప్డేట్ స్కంద 2పై రామ్ అభిమానుల్లో ఇప్పటినుంచే మరింత క్యూరియాసిటీ పెంచేస్తుంది.
The Massive Energetic Combo Madness Continues❤️🔥😍
Blockbuster director #BoyapatiSreenu and Ustaad @ramsayz‘s High-Octane Action Entertainer #Skanda Hindi crosses staggering 100 M+ views with 1 Million+ likes on YouTube🤩💥💥
Watch here 🔗https://t.co/7PRW70plE7@sreeleela14… pic.twitter.com/pdi68r7lhn
— Ramesh Bala (@rameshlaus) July 25, 2024
Raayan Review | ధనుష్ రాయన్గా మెప్పించాడా.. పర్ఫెక్ట్ బెంచ్‌మార్క్ సినిమానా.. ?
Game Changer | రాంచరణ్ గేమ్ ఛేంజర్‌లో కాసర్ల శ్యామ్ పాట.. హైప్ క్రియేట్ చేస్తున్న ఎస్ థమన్
Raghava Lawrence | టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ స్టోరీకి రాఘవా లారెన్స్ ఇంప్రెస్ అయ్యాడా..?