మునుగోడు, జనవరి 05 : పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహించొద్దని మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ అన్నారు. సోమవారం మునుగోడులోని ఒకటవ వార్డులో చేపట్టిన పారిశుధ్య పనులను పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదని కాలనీవాసులకు సూచించారు. 4 వార్డు, 9వ వార్డులో రోడ్లకు ఇరువైపులా పెరిగిన కంప చెట్లను జేసీబీ సహాయంతో తీయించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అబ్బనగోని బాలకృష్ణ, పందుల రంజిత్, పందుల స్వామి, పందుల రాజేష్, పందుల లింగస్వామి పాల్గొన్నారు.