హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలను బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదివారం తెలంగాణభవన్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎండగట్టారు. శనివారం అసెంబ్లీలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇచ్చిన పీపీటీలోని అబద్ధాలను ఆయన బయటపెట్టారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఆయన మండిపడ్డారు. నాడైనా, నేడైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహమే చేసిందని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా పండబెట్టారని విమర్శించారు. కాలువలు తవ్వితే తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నా.. లిఫ్టులు పెట్టి తక్కువ ఎకరాలకు సాగునీరిచ్చే పనులు చేశారని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కింది పీడీఎఫ్‌లో మీరు చూడవచ్చు..