koragajja | కన్నడ నాట నుంచి గ్రామీణ సంస్కృతి, ఆచారాల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన కాంతార పలు భాషల్లో విడుదలై పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే లైన్లో సరికొత్త కథాంశంతో వస్తోన్న మూవీ‘కొరగజ్జ’(korakajja Movie). కన్నడ, మలయాళం, హిందీ, తెలుగు, తమిళ్, తులు భాషల్లో రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ కింగ్ ఆఫ్ ఉడయవరగా కనిపించబోతుండగా.. భవ్య, శృతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
హోటల్ హాలీడే ఇన్ వేదికగా కొరగజ్జ ఆడియో ప్రీమియర్ ద్వారా న్యూ ఇయర్ వేడుకలను ప్రారంభించారు. కొరగజ్జ సాంగ్స్ సుమారు 300కు పైగా ఆడియో ప్లాట్‌ఫాంలలో రిలీజయ్యాయి. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సరికొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు మేకర్స్. సాంగ్స్ రీల్స్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. కొరగజ్జ మూవీ సాంగ్స్‌తో రీల్స్ క్రియేట్ చేయాలని.. ఎవరి వీడియోలకైతే ఎక్కువ వ్యూస్, లైక్స్, కామెంట్స్ వస్తాయో.. వారు జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో కలిపి మొత్తం రూ.కోటి విలువైన కానుకలు గెలుచుకునే అవకాశముందని తెలిపారు. ప్రతీ వారం జిల్లా స్థాయిలో గిప్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు మేకర్స్.
లీడ్ క్యారెక్టర్ కొరగజ్జ థీమ్‌ను ప్రతిబింబించేలా సరికొత్త గెటప్‌లో కనిపిస్తూ.. కొరగజ్జ మరో కాంతార కాబోతుందని హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రానికి గోపీసుందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ మూవీలోని అన్ని పాటలను డైరెక్టర్ కమ్ రైటర్ సుధీర్ అత్తావర్ రాయడం విశేషం. కర్ణాటక తులునాడులో పూజింపబడే దైవం ‘కొరగజ్జ’ కథతో ఈ సినిమా రాబోతుంది. సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ సాఫల్య నిర్మిస్తున్నారు.