Raayan Review | ధనుష్ రాయన్గా మెప్పించాడా.. పర్ఫెక్ట్ బెంచ్‌మార్క్ సినిమానా.. ?
Raayan Review | తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్‌కు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush). గ్లామరస్, స్టైలిష్, డీగ్లామరైజ్డ్, యాక్షన్.. ఇలా ఏ జోనర్ సినిమా అయినా తనకు తానే పోటీ అంటూ చెప్పకనే చెబుతుంటాడు ధనుష్. ఈ క్రేజీ యాక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే.
Raayan Review | తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్‌కు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush). గ్లామరస్, స్టైలిష్, డీగ్లామరైజ్డ్, యాక్షన్.. ఇలా ఏ జోనర్ సినిమా అయినా తనకు తానే పోటీ అంటూ చెప్పకనే చెబుతుంటాడు ధనుష్. ఈ క్రేజీ యాక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే.
మరి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్లో సినిమా వస్తుందంటే.. అందులోనా కెరీర్లో ల్యాండ్‌మార్క్ సినిమా (D50) అయితే క్రేజ్ ఎలా ఉంటుంది. ఆ క్రేజీ సినిమానే రాయన్ (Raayan). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీని తెలుగులో ఏసియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ రిలీజ్ చేయనుంది. మరి రాయన్గా ధనుష్ ప్రేక్షకులు, అభిమానులను మెప్పించాడా..?
సినిమా ఎలా షురూ అవుతుందంటే..?
ఇంప్రెసివ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రాయన్ పాత్రకు సంబంధించి చిన్ననాటి ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో సినిమా షురూ అవుతుంది. అటు నుంచి కథ వర్తమానంలోకి వచ్చేస్తుంది. కాలిదాస్ జయరామ్‌గా సందీప్ కిషన్ ఇంట్రడక్షన్ తర్వాత ధనుష్ సింపుల్‌గా ఎంట్రీ ఇస్తాడు. ధనుష్ అతని కుటుంబం మధ్య వచ్చే సన్నివేశాలు.. ఎస్జే ఆగమనం ఉంటుంది. అటు ఫోకస్ అంత ఎస్జే సూర్య చుట్టూ ఉంటుంది. వార్నింగ్ సన్నివేశం తర్వాత సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ ఉంటుంది.
ఎజేసూర్య, అతని ప్రత్యర్థి మధ్య ఘర్షణ సృష్టించేందుకు ప్రకాశ్ రాజ్ ప్లాన్ వేస్తాడు. ఇక ధనుష్ సోదరి నిశ్చితార్థానికి సంబంధించిన సన్నివేశాలు వస్తాయి. షాకింగ్ సంఘటనలతో సందీప్ కిషన్ ఏజే సూర్య మనుషులతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తతకు దారితీస్తుంది. కథలో ట్విస్ట్ ఇస్తూ బ్రేక్ వస్తుంది. ధనుష్ ఎజే సూర్యల మధ్య సాగే సన్నివేశాలతో సెకండాఫ్ షురూ అవుతుంది. ధనుష్ తన సోదరిని కాపాడుకునే ప్రయత్నంతో కథలో ఊహించని ట్విస్ట్ నెలకొనడం.. ఈ క్రమంలో ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది.
నెట్టింట టాక్ ఇలా..
ధనుష్ ఇంట్రో సీన్, ఇంటర్వెల్ సీన్స్, సందీప్ కిషన్ యాక్టింగ్, ప్రీ ఇంటర్వెల్ గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతాయని అంటున్నారు నెటిజన్లు. ధనుష్ 50వ సినిమాకు సరైన ఎంపిక రాయన్ అని అంటున్నారు. నటుడిగానే స్టన్నింగ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టడమే కాదు.. డైరెక్టర్‌గా కూడా ధనుష్‌కు సూపర్ కెరీర్ ఉందని రాయన్‌తో రుజువైందని చెబుతున్నారు. రాయన్ తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా అని.. తన బెంచ్ మార్క్ సినిమాను డైరెక్ట్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడని నెట్టింట వస్తున్న టాక్ చెబుతోంది.
రొటీన్‌గా అనిపించిన లీడ్ క్యారెక్టర్ల నటన డీసెంట్‌గా ఉంటుందని సినీ జనాలు చెబుతున్నారు. డైరెక్టర్‌గా ధనుష్ సినిమాకు పూర్తి న్యాయం చేశాడని.. ఓ క్రైం డ్రామాలో టైటిల్ రోల్‌తోపాటు పలు పాత్రలపై పెట్టిన ఫోకస్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందంటున్నారు. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే.. సెకండాప్ ఉత్తమంగా ఉంటుందని.. డైరెక్టర్‌గా ఫుల్ మార్కులు వేయొచ్చని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.
First Half – 🤝
Interval Block, Visuals, Director D, ARR 🔥#Raayan#RaayanFDFS#Copypaste pic.twitter.com/ZOiJfXQKQ3
— Maaran (@Yuvankanni_31) July 26, 2024
#Raayan From Today 🔥🔥🔥🔥🔥
It’s going bangerrr🔥💥💥💥💥💥 Positive Reviews All over 😭😭😭 Big win Thalaivaa #Raayan Now Yours #RaayanFromToday #RaayanFDFS #RaayanInRamCinemas pic.twitter.com/zcksCuctxa— Kumar Sachin (@KumarSachi22718) July 26, 2024
#Raayan paaka movie for movie lovers 😭❤️💥💥💥💥 ..dhanush na and Sandeep Kishan pirichu vitrukainga 😭 .. arr ayya hats off .. director actor #Dhanush50 verithanam is a one word review from my side #RaayanRageTomorrow #Raayan #Dhanush @dhanushkraja pic.twitter.com/tKGDXqz9cw
— Random (@Random_twitss) July 26, 2024
#Dhanush The Director did a good job with the crime drama, focusing on multiple characters rather than just the title character. The second half was better than the first. Dhanush, ARR, Dushara, SJS did well #RaayanFDFS #Raayan #Dhanush50 #D50 @arrahman Thalaiva🙏🙏🙏 pic.twitter.com/DivUNEvpfz
— 𓃵NK (@NKthisis) July 26, 2024
Read Also :
Game Changer | రాంచరణ్ గేమ్ ఛేంజర్‌లో కాసర్ల శ్యామ్ పాట.. హైప్ క్రియేట్ చేస్తున్న ఎస్ థమన్
Raghava Lawrence | టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ స్టోరీకి రాఘవా లారెన్స్ ఇంప్రెస్ అయ్యాడా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

