Venezuela | ట్రంప్ బెదిరింపులతో వెనక్కి తగ్గిన వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు.. అమెరికా సహకారం కావాలని పిలుపు
Venezuela | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వెనక్కి తగ్గారు. తమ దేశంతో కలిసి పనిచేయాలని, తమకు సహకరించాలని అమెరికాకు పిలుపునిచ్చారు.
Venezuela | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వెనక్కి తగ్గారు. తమ దేశంతో కలిసి పనిచేయాలని, తమకు సహకరించాలని అమెరికాకు పిలుపునిచ్చారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించి తీసుకెళ్లిన సమయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. ఇప్పుడు అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం.
అంతర్జాతీయ చట్టాల పరిధిలో, పరస్పర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామని రోడ్రిగ్జ్ ప్రకటించారు. దీర్ఘకాలిక సంబంధాన్ని బలోపేతం చేసే ఎజెండాతో తన ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ మేరకు ఆదివారం రాత్రి రోడ్రిగ్జ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే మదురోను అమెరికా బలగాలు పట్టుకెళ్లినప్పుడు మాత్రం ఆ చర్యను రోడ్రిగ్జో తీవ్రంగా వ్యతిరేకించారు. మదురోను వెంటనే వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశానికి ఒకరే అధ్యక్షులుగా ఉన్నారు.. ఆయనే మదురో అని పేర్కొన్నారు.
అయితే, రోడ్రిగ్జో తాత్కాలిక ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఆమెను తీవ్రంగా హెచ్చరించారు. అమెరికాను ఎదిరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.. ఆమె సరైన నిర్ణయాలు తీసుకోకపోతే.. మదురో కంటే పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రోడ్రిగ్జో వెనక్కి తగ్గి.. అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

