Game Changer | రాంచరణ్ గేమ్ ఛేంజర్‌లో కాసర్ల శ్యామ్ పాట.. హైప్ క్రియేట్ చేస్తున్న ఎస్ థమన్
Game Changer | రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తున్న గేమ్‌ఛేంజర్ (Game changer) చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి జరగండి జరగండి పాటను విడుదల చేయగా నెట్టింట చక్కర్లు కొడుతూ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.
Game Changer | టాలీవుడ్ సినీ జనాలతోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి గేమ్‌ఛేంజర్ (Game changer). రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి జరగండి జరగండి పాటను విడుదల చేయగా నెట్టింట చక్కర్లు కొడుతూ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.
తాజాగా ఈ సినిమాలో క్రేజీ పాట గురించి అప్డేట్ అందించి మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్. ఇందులో కాసర్ల శ్యామ్ ఓ పాటను రాశారు. శంకర్ డైరెక్టర్ చేసిన ఒకేఒక్కడు సినిమాలో నెల్లూరి నెరజానా పాట ఏ స్థాయిలో హిట్టయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గేమ్ ఛేంజర్ సినిమాకు హైలెట్‌గా నిలిచిపోయేలా ఇలాంటి పాటే ఉండబోతుందని ఓ చిట్‌చాట్‌లో చెప్పారు కాసర్ల శ్యామ్. ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ.. ఈ పాట గేమ్ ఛేంజర్ లవ్.. అంటూ ట్వీట్ చేసి సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు థమన్.
థమన్ చెప్పిన సాంగ్ ఫ్లాష్ బ్యాక్‌లో అంజలి, రాంచరణ్‌పై ఉండబోతుందట. మరి ఇదే నిజమైతే అభిమానులకు మాత్రం పండగే అని చెప్పాలి. ఈ చిత్రంలో సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్లర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరాయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇందులో రాంచరణ్ కథానుగుణంగా తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడని తెలుస్తోండగా.. తండ్రి పాత్రకు జోడీగా అంజలి కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తుండగా.. పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తున్నాడు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
This song ❤️🩵🥹 !! #GameChanger https://t.co/VWFxy7pvnA
— thaman S (@MusicThaman) July 25, 2024
Read also :
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ VD12లో బుట్టబొమ్మ బ్యూటీ.. ఇంతకీ పాత్ర ఏంటో మరి
Pushpa 2 The Rule | అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మళ్లీ వాయిదా..? ఏంటీ కారణమిదేనా.. !
Varun Dhavan | ఆగస్టు 1వ తేదీ ఫిక్స్.. వరుణ్ ధవన్ టీం సిటడెల్ గురించి ఏం చెప్పబోతుందో మరి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

