Pushpa 2 The Rule | టాలీవుడ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి పుష్ప ది రూల్ (Pushpa The Rule). ఈ ప్రాంఛైజీ ప్రాజెక్టుకు మరోసారి సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తుండగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ముందుగా వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఆగస్టు 15నే థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. ఈ చిత్రాన్ని 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
అయితే ఇప్పడు మరోసారి పుష్ప ది రూల్ వాయిదా పడబోతుందన్న వార్త అభిమానులు, సినీ జనాల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజా టాక్ ప్రకారం సీక్వెల్‌ను 2025 ఏప్రిల్‌కు మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇంతకీ దీనిక్కారణమేంటని తెగ చర్చించుకుంటుండగా.. సినిమాకు సంబంధించిన పెండింగ్ పనులు, రీషూట్స్ వల్లే వాయిదా వేసే అవకాశాలున్నాయని వార్తలు తెరపైకి వస్తున్నాయి. మరి ఈ వార్తలపై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
ఇక వాయిదా మాట అటుంచితే సినిమా ఎప్పుడు విడుదలైనా పుష్పరాజ్ మరోసారి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ డేట్ షేర్ చేస్తూ విడుదల చేసిన కొత్త పోస్టర్లో బన్నీ పుష్పరాజ్‌గా కత్తి పట్టుకుని ఊరమాస్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సీక్వెల్‌కు కూడా పనిచేస్తు్ండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన పుష్ప పుష్ప, సూసేకి సాంగ్స్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదలై నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాయి. సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
CONFIRMED: According to our sources, #Pushpa2TheRule might get postponed to summer 2025 due to pending work and reshoots. No matter when it releases, this #AlluArjun starrer will break all existing records especially in North India. #Pushpa2 pic.twitter.com/rT1BNqQ9xp
— Mumbai Box-Office (@MumbaiBoxOffice) July 25, 2024
Samantha | సమంత ప్రాజెక్ట్‌లో మీర్జాపూర్ యాక్టర్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?