SS Rajamouli | అన్ని సినిమాలకు బాప్‌గా జక్కన్న ఎస్ఎస్ఎంబీ 29 : రాంగోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
SS Rajamouli | గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu)- ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంపౌండ్ నుంచి రాబోతుంది ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29).. ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
SS Rajamouli | తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29). గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu)- ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంపౌండ్ నుంచి రాబోతుంది. ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
కాగా ఈ సినిమాపై రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29) అన్ని సినిమాలకు బాప్‌గా ఉండబోతుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు వర్మ. దీని గురించి వర్మ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం సాంకేతిక నిపుణుల బృందానికి అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నాడు. మహేశ్ బాబు, రాజమౌళి సినిమా మన ఊహలకు అందని విధంగా ఉండబోతుందనుకుంటున్నానన్నాడు.
ఎస్ఎస్ రాజమౌళి విజయం తెలుగు సినిమాకు సంబంధించినదని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అతడు (జక్కన్న) గుజరాత్ వ్యక్తి అయినా.. తను అలాంటి సినిమాలనే తెరకెక్కించి అవే అత్యున్నత శిఖరాలను వెళ్లేవాడంటూ ఆకాశానికెత్తేశాడు జక్కన్న. ఈ కామెంట్స్‌తో ఎస్ఎస్ఎంబీ 29పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ మూవీలో హాలీవుడ్ స్టార్తోపాటు వివిధ భాషలకు చెందిన నటీనటులు కనిపించబోతున్నారని తెలుస్తోండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా కోసం మహేశ్ బాబు ఇప్పటికే లాంగ్ హెయిర్‌తో స్టైలిష్ లుక్‌లోకి మేకోవర్ అయ్యాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Read Also :
‘Khel Khel Mein’ | ఇండిపెండెన్స్ బరిలో అక్షయ్ కుమార్, తాప్సీ ‘ఖేల్ ఖేల్ మే’.. ఫస్ట్ లుక్ రిలీజ్
Vijay Devarakonda | విజయ్ లుక్ లీక్ అయ్యిందా.. కావాలనే లీక్ చేశారా.?
Actress Anjali | పుష్పను అంతా ఈజీగా వదిలిపెట్టను: నటి అంజలి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

