Jogu Ramanna | కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతుల గురించి పట్టింపు లేదని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతుల సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి బాటలోనే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా నడుస్తున్నారని అన్నారు. రంగు మారిన సోయాబీన్ కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు సోమవారం నాడు కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. పంట కొనుగోలు చేసేంత వరకు ఆందోళనలు చేస్తామని ప్రకటించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటలు కొనుగోలు చేయడం లేదని మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. కలెక్టరైనా పంటలను కొనుగోలు చేయాలని కోరారు. 1300 క్వింటాళ్ల సోయాబీన్ మార్కెట్ యార్డులో ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రైతు సంఘాలతో కలెక్టర్ మాట్లాడాలన్నారు. బేల మార్కెట్లో రైతుల పరిస్థితి ఘోరంగా ఉందని అన్నారు. కలెక్టర్‌కు కూడా చీమకుట్టినట్లుగా లేదని మండిపడ్డారు.
యూరియా యాప్ పెట్టారు.. కానీ షాపుల్లోనే యూరియా లేదని జోగు రామన్న విమర్శించారు. నాలుగు రోజుల నుంచి యూరియా బుక్ చేసినా దొరడకం లేదని తెలిపారు. రైతు సమస్యలు పరిష్కరించకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. రైతుల సమస్యలపై రేపు ఆదిలాబాద్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. రేపటి బంద్‌తోనైనా మార్పు రాకపోతే కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు.