మహబూబ్నగర్ : తెలంగాణలోని ప్రాజెక్టులపై(Projects) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) చేస్తున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరిస్తున్నది. నీళ్ల నిజాలను ప్రజలకు తెలయజేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా..ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎంమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రేపు(మంగళవారం) ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులను సందర్శించనున్నారు.
ముందుగా జూరాల నుంచి ప్రారంభమై ఏదుల, కల్వకుర్తి, నార్లాపూర్, వట్టెం, కర్వేన, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను సందర్శించనున్నారు. ప్రభుత్వం పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా..ఆంధ్ర బాబు లకు వత్తాసు పలుకుతూ కృష్ణా జలాల్ని తాకట్టు పెట్టడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. త్వరలో ఉమ్మడి జిల్లా కేసీఆర్ పర్యటనకు ముందే బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.