Mr Bachchan | మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేమాలయం సినిమాలో పాపులర్ పాటతో షురూ అయింది టీజర్. రవితేజ, భాగ్య శ్రీ బోర్సే లవ్ ట్రాక్ సన్నివేశాలు ఎంటర్టైనింగ్ సాగుతున్నాయి. ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు సార్.. నల్లధనం అంటూ సీరియస్ మోడ్‌లో చెబుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
సక్సెస్,ఫెయిల్యూర్ చుట్టాల్లాంటివి.. వస్తుంటాయ్.. పోతుంటాయ్.. యాటిట్యూడ్ ఇంటిపేరు లాంటిది.. అది పోయేదాకా మనతోనే ఉంటుందని మాస్ మహారాజా స్టైల్లో సాగుతున్న డైలాగ్స్ ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రవితేజ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌బచ్చన్‌కు వీరాభిమాని అని తెలిసిందే.
మాస్ మహారాజా తాజా చిత్రానికి మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రంలో కథానుగుణంగా రవితేజ బిగ్ బీ అభిమానిగా కనిపించనున్నాడని సమాచారం.
మిస్టర్ బచ్చన్ టీజర్
Read Also :
Bad Newz | విక్కీ కౌశల్, తృప్తి డిమ్రి బ్యాడ్ న్యూజ్ మైల్స్టోన్
Kubera | బర్త్ డే స్పెషల్.. ధనుష్ కుబేర నయా లుక్ వైరల్
Raayan | ధనుష్ రాయన్ స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ప్లాట్‌ఫాం ఇదే..!