Bad Newz | విక్కీ కౌశల్, యానిమల్ ఫేం తృప్తి డిమ్రి (Tripti Dimri) కాంబోలో వచ్చిన చిత్రం బ్యాడ్ న్యూజ్ (Bad Newz). అమ్మి విర్క్ మరో లీడ్ రోల్ పోషించాడు. ఆనంద్ తివారి దర్శకత్వం వహించిన ఈ మూవీలో నేహా ధూపియా కీలక పాత్రలో నటించింది. జులై 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీకి మంచి స్పందన వచ్చింది.
తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రం శుక్రవారం రూ.2.22 కోట్లు రాబట్టింది. శనివారం రూ.3.52 కోట్లు రాబట్టగా.. ఈ ఫిగర్‌తో మొత్తం కలెక్షన్లు రూ.49.86 కోట్లకు చేరాయి. సెకండ్ వీకెండ్ కల్లా బ్యాడ్‌న్యూజ్ రూ.50 కోట్ల క్లబ్‌లోకి ఎంటరవడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. హాలీవుడ్ సూపర్ హీరో ఫిల్మ్ డెడ్‌పూల్ అండ్ వాల్వెరిన్ థియేటర్లలో సందడి చేస్తున్న నేపథ్యంలో బ్యాడ్ న్యూజ్ ప్రయాణం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. Bad Newz పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో (పోస్ట్ థ్రియాట్రికల్)లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లు, ప్రమోషన్స్ తో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేశాయి. మరోవైపు Tauba Tauba సాంగ్ నెట్టింటిని షేక్ చేస్తోంది. పాపులర్ సింగర్, ర్యాపర్ Karan Aujla, విక్కీ కౌశల్ కాంబోలో తొలిసారి వస్తున్న ఈ పార్టీ యాంథెమ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్ అండ్ మూవీ లవర్స్.
The weekend growth [58.56%] has come in… #BadNewz sees a significant upward trend on [second] Sat, bringing it closer to the ₹ 50 cr mark… This escalation in numbers is commendable given the stiff competition from the mighty #DeadpoolAndWolverine.
[Week 2] Fri 2.22 cr, Sat… pic.twitter.com/Q9CiODig0P
— taran adarsh (@taran_adarsh) July 28, 2024
Kubera | బర్త్ డే స్పెషల్.. ధనుష్ కుబేర నయా లుక్ వైరల్
Raayan Review | ధనుష్ రాయన్గా మెప్పించాడా.. పర్ఫెక్ట్ బెంచ్‌మార్క్ సినిమానా.. ?
Raayan | ధనుష్ రాయన్ స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ప్లాట్‌ఫాం ఇదే..!