సర్పంచ్ మిర్చిపంటపై కలుపుమందు పిచికారీ
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు దుర్మార్గపు చర్యకు పూనుకున్నారు. సర్పంచ్‌గా గెలిచిన వ్యక్తిని ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్ని అతడు సాగుచేస్తున్న మిర్చిపంటపై కలుపుమందు పిచికారీ చేయించారు.
- బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గెలుపును జీర్ణించుకోలేక కాంగ్రెస్ దుండగుల దుర్మార్గపు దుశ్చర్య
- దెబ్బతిన్న పంటను పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు
రఘునాథపాలెం, జనవరి 4: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు దుర్మార్గపు చర్యకు పూనుకున్నారు. సర్పంచ్‌గా గెలిచిన వ్యక్తిని ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్ని అతడు సాగుచేస్తున్న మిర్చిపంటపై కలుపుమందు పిచికారీ చేయించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోటపాడులో బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్‌గా పోటీచేసిన కొంటెముక్కల వెంకటేశ్వర్లు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ వ్యక్తులు సర్పంచ్ సాగు చేస్తున్న మిర్చిపంటపై శనివారం అర్ధరాత్రి దుండగులతో కలుపుమందు కొట్టించారు.
ఆదివారం ఉదయం మిర్చి పంటను సర్పంచ్ వెంకటేశ్వర్లు తండ్రి శ్రీనివాసరావు చూడగా పంటపై కలుపుమందు కొట్టినట్టు గుర్తించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మండల నాయకులు..దెబ్బతిన్న మిర్చి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ గెలుపును తట్టుకోలేక కాంగ్రెస్ వ్యక్తులు ఇలాంటి చర్యలకు పూనుకోవడం సరికాదని హితవు పలికారు. వ్యవసాయశాఖ మంత్రి నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనపై బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

