రాష్ట్రంలో రైతులకు గడ్డు రోజులు.. యూరియా సరఫరాపై పొంతన లేని మంత్రుల ప్రకటనలు
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో యూరియా పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు.
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- కొత్తూరులో యూరియా పంపిణీ కేంద్రం పరిశీలన.. సర్కార్‌పై ఫైర్
రాయపర్తి, జనవరి 4: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో యూరియా పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు యూరియా బస్తాల కోసం పడుతున్న ఇబ్బందులను ఎర్రబెల్లికి వివరించగా, వెంటనే ఆయన వ్యవసాయాధికారులతో ఫోన్లో మాట్లాడారు.
రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా బస్తాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. మంత్రులంతా రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని ప్రకటనలు గుప్పిస్తున్నారని, కానీ, రాష్ట్రంలో ఎక్కడా రైతులకు కావల్సినన్ని యూరియా బస్తాలు అందడంలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా బస్తాలు, సాగు నీరు, ఎరువులు, పురుగు మందులు అందక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా అందించాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ
లింగాల, జనవరి 4 : నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల పీఏసీసీఎస్ ఎదుట ఆదివారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. వ్యవసాయాధికారులు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి యూరియా పంపిణీ చేపట్టారు. ఎకరాకు మూడు బస్తాలు మాత్రమే ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అవసరమైనంత యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
రైతన్న పడిగాపులు
రామాయంపేట, జనవరి4: మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రానికి ఆదివారం తెల్లవారుజామునే రైతులు చేరుకున్నారు. మూడు గంటలపాటు వేచి ఉండగా ఒకే లారీ యూరియా రావడంతో రైతులకు తలా రెండు బ్యాగులు మాత్రమే అధికారులు అందజేశారు. కొందరు రైతులకు యూరియా లభించక నిరాశతో వెనుదిరిగారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

