స్వాయత్త మేకాంత హితం విధాత్రా
వినిర్మితం ఛాదన మజ్ఞ తాయాః
విశేషతః సర్వవిదాం సమాజే
విభూషణం మౌనమపండితానాం
తెలివి తక్కువ వారు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకోకుండా ఉండదలిస్తే వారిలోనే ఒక రక్షణ కవచాన్ని భగవంతుడు ఉంచాడు. అన్ని తెలిసిన పెద్దలందరు ఉన్న సమూహంలో మౌనంగా ఉంటే వారికి అన్నివిధాల గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా ఉంటుంది.
– టి.సుధాకరశర్మ