అశ్వాపురం, మార్చి 4 : ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పారిశుధ్య కార్మికులు విధులకు హాజరుకావడంలేదు. దీంతో ప్రజలు పారిశుధ్య సమస్యతో ఇబ్బంది పడొద్దని, ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలనే ఉద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ఆనందాపురం సర్పంచ్ ముర్రం సమ్మయ్య బుధవారం పారిశుధ్య కార్మికుడిగా మారారు. తనను గెలిపించిన ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో గ్రామపంచాయతీ ట్రాక్టర్ తీసుకొని ఇంటింటికీ తిరుగుతూ చెత్త సేకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సమ్మ య్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, దీంతో కార్మికులు విధులకు హాజరుకావడం తెలిపారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడి కార్మికుల జీతాలు వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.