పెన్‌పహాడ్, జూలై 29 : అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో విశ్రాంతి తీసుకుంటున్న పెన్‌పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామ నివాసి బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి తండ్రి ఒంటెద్దు రాఘవరెడ్డిని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి బుధవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీ బడుగుల లింగయ్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, మాజీ వైస్ చెర్మన్ పుట్ట కిశోర్, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్ పాల్గొన్నారు.