జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) కోఆర్డినేటర్ ధార భాస్కర్ బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
- లోనికి వెళ్లేందుకు యత్నించిన కాంగ్రెస్ నేత అరెస్ట్
- ఎమ్మెల్యే, అతడి సోదరుడికి వ్యతిరేకంగా నినాదాలు
జడ్చర్ల టౌన్, మార్చి 4 : తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) కోఆర్డినేటర్ ధార భాస్కర్ బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నవాబ్‌పేట మండలం పోమాలకు చెందిన భాస్కర్ ప్రెస్‌మీట్ పెట్టేందుకు క్యాంప్ కార్యాలయంలోకి వెళ్తుండగా.. పోలీసులు గేటు వద్దనే అడ్డుకున్నారు. ఈ క్రమంలో భాస్కర్‌కు పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకోవడం తో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఎమ్మెల్యే, అతడి సోదరుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార పార్టీ నేత, టీపీసీసీ కోఆర్డినేటర్‌గా ఉన్న తాను క్యాంప్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెడుతానంటే భయమెందుకని ప్రశ్నించారు. కొన్ని రోజులుగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సోదరుడు దుశ్యంత్‌రెడ్డికి, టీపీసీసీ కోఆర్డినేటర్ భాస్కర్‌కు మధ్య వివాదం నడుస్తున్నది.
ఈ క్రమంలో తనపై తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నాడని, వివాదం గురించి జడ్చర్ల క్యాంప్ కార్యాలయంలోనే ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడిస్తానని భాస్కర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అనుమతి లేకుండా ప్రెస్‌మీట్ పెట్టేందుకు వచ్చిన భాస్కర్‌ను అరెస్ట్ చేసి అడిషనల్ ఎస్పీ ఎదుట హాజరుపర్చినట్టు సీఐ కమలాకర్ తెలిపారు.. జడ్చర్లలో ఓ టీ షాపు వద్ద టీపీసీసీ కోఆర్డినేటర్ భాస్కర్ తనను కొట్టాడంటూ ఓ కాంగ్రెస్ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ రాజాపూర్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య.. కొద్ది రోజుల కిందట ఎమ్మెల్యే సోదరుడితో తనకు ప్రాణహాని ఉందని పీఎస్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే సోదరుడు తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నాడని మరో నేత ఆరోపిస్తూ ఏ కంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

