Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ప్రేమాయణాలు, నామినేషన్లు, కెప్టెన్సీ పోటీలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. తాజాగా ఆరో వారం వీకెండ్ ఎపిసోడ్‌కు సంబంధించి పలు ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ప్రేమాయణాలు, నామినేషన్లు, కెప్టెన్సీ పోటీలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. తాజాగా ఆరో వారం వీకెండ్ ఎపిసోడ్‌కు సంబంధించి పలు ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని భావించిన ప్రేక్షకులకు బిగ్‌బాస్ మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, షాలినిని ఎలిమినేట్ చేసినట్లు ప్రకటించి, ఆ తర్వాత సీక్రెట్ రూమ్‌లోకి పంపించనున్నారనే వార్త కూడా వైరల్ అవుతోంది.
బిగ్‌బాస్ తెలుగు 10లో ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్‌ను వీడనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరు బయటకు వెళ్తారనే ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.మరోవైపు, షాలినిని ఎలిమినేట్ చేసినట్లు ప్రకటించి, ఆమెను నేరుగా ఇంటి నుంచి బయటకు పంపకుండా సీక్రెట్ రూమ్‌లో ఉంచనున్నారని కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు వార్తల మధ్య స్పష్టత రావాల్సి ఉంది. ఆరో వారం ఓటింగ్‌లో షాలిని తక్కువ ఓట్లు సాధించి డేంజర్ జోన్లో నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ఆమె ఎలిమినేషన్‌ను ప్రకటించి, జర్నీ వీడియోను కూడా చూపించనున్నారనే ప్రచారం సాగుతోంది.
అయితే అసలు ట్విస్ట్ అక్కడే ఉండబోతోందని సమాచారం. షాలినిని హౌస్ నుంచి పూర్తిగా బయటకు పంపకుండా సీక్రెట్ రూమ్‌కు తరలించి, అక్కడి నుంచి ఒకటి లేదా రెండు రోజుల్లో తిరిగి హౌస్‌లోకి పంపించే అవకాశం ఉందని అంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆమె రీఎంట్రీ ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిణామం నిజమైతే హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్లకు తెలియకుండా షాలిని కొంతకాలం వారి ఆటతీరును గమనించే అవకాశం ఉంటుంది. అయితే ఆమె నిజంగానే సీక్రెట్ రూమ్‌లోకి వెళ్తుందా? తిరిగి హౌస్‌లోకి వస్తుందా? అనేది అధికారిక ఎపిసోడ్‌లోనే తేలనుంది. తాజా ప్రచారం ప్రకారం, షాలిని ఎలిమినేట్ అవుతున్న సమయంలో రోహిత్‌కు తన మనసులోని మాటను చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున ఆమె ఎలిమినేషన్ ప్రకటించడంతో రోహిత్ భావోద్వేగానికి గురై ఏడ్చినట్లు కూడా కథనాలు పేర్కొంటున్నాయి. షాలిని జర్నీ వీడియోలో రోహిత్‌కు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

