Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Greater Noida | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని గ్రేటర్ నోయిడా (Greater Noida) లో శుక్రవారం రాత్రి నూడుల్స్ (Noodles) తిని, టీ (Tea) తాగి పడుకున్న ఐదుగురు కుటుంబసభ్యులు తెల్లారేసరికి మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే నూడుల్స్, టీలో కల్తీయే కారణమని ముందుగా అంతా భావించారు.
Greater Noida : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని గ్రేటర్ నోయిడా (Greater Noida) లో శుక్రవారం రాత్రి నూడుల్స్ (Noodles) తిని, టీ (Tea) తాగి పడుకున్న ఐదుగురు కుటుంబసభ్యులు తెల్లారేసరికి మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే నూడుల్స్, టీలో కల్తీయే కారణమని ముందుగా అంతా భావించారు. కానీ వారి మృతికి నూడుల్స్, టీ కల్తీ కారణం కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది. వారు విషం ప్రభావంతో మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
వారికి ఫుడ్ పాయిజనింగ్ కాలేదని పోలీసులు తెలిపారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆస్తి వివాదం కారణంగా ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు మృతుడు మహేష్ తన ఫోన్లో రికార్డ్ చేసిన వాయిస్ నోట్ ద్వారా ఈ విషయాన్ని గుర్తించామన్నారు. ఆస్తి కోసం ఇద్దరు సోదరీమణులు, బావ తమ కుటుంబాన్ని కొన్నేళ్లుగా వేధిస్తున్నట్లు మహేష్ తన వాయిస్ నోట్లో పేర్కొన్నారు. వారి వేధింపులు తాళలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు.
దాంతో పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఐదుగురు కుటుంబసభ్యులు నూడుల్స్లో విషం కలుపుకుని తిని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

