Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
Kolkata Stampede | పశ్చిమబెంగాల్ (West Bengal) రాజధాని కోల్కతా (Kolkata) లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనలో తీవ్రంగా గాయపడి స్థానిక అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఈ ఉదయం కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah), పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) సువేందు అధికారి (Su) పరామర్శించారు.
Kolkata Stampede : పశ్చిమబెంగాల్ (West Bengal) రాజధాని కోల్కతా (Kolkata) లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనలో తీవ్రంగా గాయపడి స్థానిక అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఈ ఉదయం కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah), పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) సువేందు అధికారి (Su) పరామర్శించారు. బాధితులతో మాట్లాడి ఘటన ఎలా జరిగిందని ఆరా తీశారు. ఆందోళన చెందవద్దని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని వారికి భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాగా శనివారం రాత్రి 7.40 గంటల సమయంలో పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని చోర్బగాన్ సర్బజనీన్ దుర్గా మండపంవద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 17 మంది మృతిచెందారు. మృతుల్లో 13 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మరో 35 మంది గాయపడ్డారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 19కి చేరింది. గాయపడిన వారంతా ప్రస్తుతం వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటించాయి. కేంద్రం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నట్లు వెల్లడించింది. మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, గాయపడిన వారి చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది.
#WATCH | Kolkata, West Bengal: Union Home Minister Amit Shah and CM Suvendu Adhikari arrive at Apollo Hospital to meet those injured in the Chorbagan Sarbojanin Durga Puja stampede incident, which claimed 19 lives. https://t.co/WwXPOEm3gg
— ANI (@ANI) October 18, 2026
#WATCH | Kolkata, West Bengal: Union Home Minister Amit Shah, CM Suvendu Adhikari arrive at Kalighat Kali Temple https://t.co/3KWvJvBzlV
— ANI (@ANI) October 18, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

