Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Kolkata stampede : కోల్కతా తొక్కిసలాట ఘటనలో 19 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి అన్నారు.
Kolkata stampede : కోల్కతా తొక్కిసలాట ఘటనలో 19 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆదివారం ప్రకటన చేశారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా తొక్కిసలాట ఘటనపై స్పందించారు.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించారు. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందిస్తామని మోదీ ప్రకటించారు. ఈ ఘటనపై బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
అయితే, దుర్గా మండపం దగ్గర నిర్వహణా లోపమే తొక్కిసలాటకు కారణమని టీఎంసీ ఆరోపించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయలేదని విమర్శించింది. మండపం దగ్గర పోలీసులు, తగినంత భద్రత కూడా ఏర్పాటు చేయలేదని టీఎంసీ ఆరోపించింది. ఈ మండపం నిర్వాహకులు సీఎంకు అత్యంత సన్నిహతులు, బంధువులు అని టీఎంసీ తెలిపింది. ఈ పూజా కమిటీకి ఒక బీజేపీ ఎమ్మెల్యేనే ఛైర్మన్గా ఉన్నాడని టీఎంసీ ఆరోపించింది. ఇప్పుడు ఈ మృతులకు బాధ్యత ఎవరు తీసుకుంటారు అని టీఎంసీ ప్రశ్నించింది.
అయితే, టీఎంసీ ఆరోపణలపై సీఎం సువేందు అధికారి ఘాటుగా స్పందించారు. గతంలో మమత ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని ప్రస్తావించారు. 2025లో కూడా ఇలాంటి ఘటన జరిగిందని, అప్పుడు 13 మంది మరణించారని గుర్తు చేశారు. అప్పుడు మమతా బెనర్జీ బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించారా అంటూ సువేందు ప్రశ్నించారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని మండపాల వద్ద భద్రతా తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

