Ram Pothineni | టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం డబుల్ఇస్మార్ట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాద్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కాకముందే రామ్ కొత్త సినిమా న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేం పీ మహేశ్ బాబు (Mahesh Babu P) డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని ఇప్పటికే నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ క్రేజీ సినిమాపై ఆసక్తికర వార్త ఒకటి మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది. సెప్టెంబర్‌లో ఈ మూవీ షూటింగ్ మొదలు కానుండగా… వచ్చే నెలలో దీని కోసం సెట్‌ను కూడా నిర్మించనున్నారని ఇన్సైడ్ టాక్. అంతేకాదు డైరెక్టర్ అండ్ టీం ప్రస్తుతం నటీనటుల ఎంపికపై ఫోకస్ పెట్టగా.. ఆగస్టు చివరి కల్లా ఈ ప్రక్రియ పూర్తి కానుందని ఫిలింనగర్ సర్కిల్లో ఓ అప్డేట్ రౌండప్ చేస్తోంది.
టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. మరి మహేశ్ బాబు ఎనర్జిటిక్ యాక్టర్ రామ్‌ను ఎలా చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Kubera | బర్త్ డే స్పెషల్.. ధనుష్ కుబేర నయా లుక్ వైరల్
Raayan Review | ధనుష్ రాయన్గా మెప్పించాడా.. పర్ఫెక్ట్ బెంచ్‌మార్క్ సినిమానా.. ?
Raayan | ధనుష్ రాయన్ స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ప్లాట్‌ఫాం ఇదే..!