Double ISMART | పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా మాస్ మ్యూజిక్ జాతరను షురూ చేసింది పూరీ టీం. తాజాగా మూడో సాంగ్ KyaLafdaను షేర్ చేసింది. ఈ సీజన్ రొమాంటిక్ మెలోడీ సాంగ్ అంటూ విడుదల చేసిన పాట మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి లాంచ్ చేసిన ఫస్ట్ సింగిల్ STEPPAMAAR ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌తోపాటు మార్ ముంతా చోడ్ చింతా సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది.
ఇక పూరీ టీం రిలీజ్ చేసిన ధిమాక్కిరికిరి డబుల్ ఇస్మార్ట్ టీజర్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. ఇస్మార్ట్ శంకర్‌కు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి పనిచేస్తుండటంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది.
Kya Lafda సాంగ్..
Adding warmth to your monsoon playlist with the ROMANTIC MELODY OF THE SEASON ❤️🔥#DoubleISMART Third Single #KyaLafda out now 🎵❤️
A #ManiSharma Musical 🎹#DoubleIsmartOnAug15
Telugu
✍️ @SriharshaEmani
🎙️@DhanunjaySinger #SindhujaSrinivasanHindi… pic.twitter.com/pMED8bIvCl
— Puri Connects (@PuriConnects) July 29, 2024
Chiyaan Vikram | చియాన్ 63 డైరెక్టర్ ఫైనల్ అయినట్టే.. క్లారిటీ ఇచ్చేసిన విక్రమ్
Ram Pothineni | క్రేజీ న్యూస్.. రామ్, మహేశ్ బాబు మూవీ సెట్స్‌పైకి వెళ్లే టైం ఫిక్స్ ..!