Siddipet సిద్దిపేట మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
Siddipet | సిద్దిపేట మెడికల్ కాలేజీలో విషాదం నెలకొంది. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఓ జూనియర్ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన తోటి జూనియర్ డాక్టర్లు.. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది.
Siddipet | సిద్దిపేట మెడికల్ కాలేజీలో విషాదం నెలకొంది. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఓ జూనియర్ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన తోటి జూనియర్ డాక్టర్లు.. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి కన్నుమూసింది.
వివరాల్లోకి వెళ్తే.. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య సిద్దిపేట మెడికల్ కాలేజీలో 2020 బ్యాచ్ విద్యార్థిని. హౌస్ సర్జన్ పూర్తి చేసిన ఆమె.. ప్రస్తుతం సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇంటర్న్షిప్ చేస్తోంది. శుక్రవారం ఉదయం లేబర్ డ్యూటీలో ఉన్న సమయంలో లావణ్య అనారోగ్యానికి గురైంది. దీంతో క్యాజువల్ డిపార్ట్మెంట్లో చికిత్స తీసుకుని కాలేజీ హాస్టల్కు వెళ్లింది. తర్వాత ఏమైందో తెలియదు గానీ.. శనివారం ఉదయం హాస్టల్లోనే గడ్డి మందును ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్యకు యత్నించింది.
ఇది గమనించిన తోటి జూనియర్ డాక్టర్లు వెంటనే జీజీహెచ్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందింది. ఇంటర్న్షిప్ డ్యూటీలు, నీట్ పీజీ ప్రిపరేషన్ ఒత్తిడితో లావణ్య ఆత్మహత్యకు పాల్పడినట్లుగా మెడికల్ కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. లావణ్య కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

