Bhagyashri Borse | త్వరలోనే తెలుగు ప్రేక్షకులను మాయ చేసేందుకు రెడీ అవుతోంది పూణే సుందరి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse). ఈ భామ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటిస్తోన్న ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) లో హీరోయిన్గా నటిస్తోందని తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కానుంది. హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఆసక్తికర వార్త షేర్ చేసింది భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్‌లో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసింది.
భాగ్యశ్రీ బోర్సే ఈ విషయాన్ని తెలియజేస్తూ డబ్బింగ్ స్టూడియోలో తీసిన స్టిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మూవీ నుంచి రవితేజ, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చే సితార్ సాంగ్‌తోపాటు రెప్పల్ డప్పులు పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇందులో భాగ్య శ్రీ బోర్సే తన అందాల ఆరబోతతో ప్రేక్షకులను నిద్రపట్టనీయకుండా చేయడం ఖాయమని ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి.
ఈ భామ మరోవైపు పాపులర్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ డెబ్యూ డైరెక్టర్ రవి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో హీరోయిన్గా మెరువబోతుందని వార్తలు వస్తుండగా.. దీనిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. ఇక మిస్టర్ బచ్చన్ టైటిల్ పోస్టర్లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ లుక్‌లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు.
Magadheera | రాంచరణ్ ల్యాండ్ మార్క్ మూవీ మగధీర @ 15 ఇయర్స్
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్
Mani Ratnam | అఫీషియల్.. కమల్‌హాసన్-మణిరత్నం థగ్ లైఫ్ టీంలోకి మరో ఇద్దరు యాక్టర్లు