Mani Ratnam | పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ‘థగ్ లైఫ్’ (Thug life). కమల్‌హాసన్ (Kamalhaasan) లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహిస్తున్నాడు. KH234గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు, పాపులర్ మాలీవుడ్ యాక్టర్ జోజు జార్జ్, గౌతమ్ కార్తీక్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ఐశ్వర్యలక్ష్మి, త్రిష, ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
తాజాగా మరో ఇద్దరు యాక్టర్లకు మణిరత్నం టీం స్వాగతం పలికింది. పాపులర్ యాక్టర్ నాజర్, అభిరామి థగ్ లైఫ్ యాక్టర్ల జాబితాలో చేరిపోయారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది మణిరత్నం టీం. మొత్తం మరి మణిరత్నం వీరిని ఎలా చూపించబోతున్నాడన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. థగ్ లైఫ్ డబ్బింగ్ పనులు షురూ అయ్యాయని తెలియజేస్తూ కమల్ హాసన్ డబ్బింగ్ స్టూడియోకు సంబంధించిన విజువల్స్ అందరితో పంచుకున్నారు మేకర్స్.
థగ్‌లైఫ్ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని కమల్ హాసన్-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్-ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే థగ్ లైఫ్ నుంచి Sigma Thug Rule అంటూ విడుదల చేసిన వీడియోలో శింబు స్టైలిష్ ఎంట్రీ ఇస్తున్న విజువల్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
Excited to welcome #Nasser and @abhiramiact to the stellar #ThugLife family. #Ulaganayagan #KamalHaasan #SilambarasanTR@ikamalhaasan #ManiRatnam @SilambarasanTR_ @arrahman #Mahendran @bagapath pic.twitter.com/PwzKksq1Mf
— Raaj Kamal Films International (@RKFI) July 30, 2024
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్
Shah Rukh Khan | చికిత్స కోసం యూఎస్‌కు షారుఖ్‌ఖాన్..!
Raja Saab | సూపర్ స్టైలిష్ రాజాసాబ్గా ప్రభాస్ ఎంట్రీ.. మారుతి గ్లింప్స్ అదిరిందంతే..!
Thug life | డబ్బింగ్ స్టూడియోలో కమల్‌హాసన్.. థగ్ లైఫ్ టీం కొత్త వార్త ఇదే..!