Shah Rukh Khan | బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) యూఎస్‌కు వెళ్లనున్నాడన్న వార్త ఒకటి బీటౌన్‌లో రౌండప్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం కంటి నొప్పి కారణంగా డాక్లర్లను సంప్రదించాడు షారుఖ్‌ఖాన్. అయితే అత్యవసర చికిత్స కోసం యూఎస్ వెళ్లాలని డాక్టర్లు సూచించారు. ఈ నేపథ్యంలో షారుఖ్‌ఖాన్ ఇవాళ రాత్రి కానీ లేదా రేపు యూఎస్‌కు పయనం కానున్నాడట.
షారుఖ్ ఖాన్ వెంట సతీమణి గౌరీఖాన్, కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా యూఎస్‌కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా షారుఖ్‌ఖాన్‌కు అత్యవసర చికిత్స అని వార్తలు రావడంతో ఆందోళనకు లోనవుతున్నారు అభిమానులు. బాద్ షా కంటి బాధ నుంచి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఈ ఏడాది కోల్‌కతాలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా షారుఖ్‌ఖాన్ వడదెబ్బకు లోనైన విషయం తెలిసిందే.
Raja Saab | సూపర్ స్టైలిష్ రాజాసాబ్గా ప్రభాస్ ఎంట్రీ.. మారుతి గ్లింప్స్ అదిరిందంతే..!
Thug life | డబ్బింగ్ స్టూడియోలో కమల్‌హాసన్.. థగ్ లైఫ్ టీం కొత్త వార్త ఇదే..!
Double ISMART | డబుల్ ఇస్మార్ట్ రొమాంటిక్ మెలోడీగా రామ్, కావ్య థాపర్ Kya Lafda సాంగ్
Chiyaan Vikram | చియాన్ 63 డైరెక్టర్ ఫైనల్ అయినట్టే.. క్లారిటీ ఇచ్చేసిన విక్రమ్