Magadheera | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకున్న స్థానం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాలీవుడ్ డైరెక్టర్లు, హీరోలు తెలుగు సినిమా ఖ్యాతిని ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా తమ సినిమాలతో చాటిచెప్పారు. తెలుగు సినిమా రేంజ్‌ను పెంచిన చిత్రాల్లో టాప్‌లో ఉంటుంది మగధీర (Magadheera). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రాంచరణ్ (Ram charan), కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2009 జులై 30న విడుదలైంది.
మగధీర నేటితో సక్సెస్‌ఫుల్‌గా 15 ఏండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ అరుదైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మూవీ లవర్స్, అభిమానులు. రాంచరణ్‌కు పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేయడమే కాకుండా.. కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోయింది. సౌతిండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో రెండు సంవత్సరాలుగా ఏకధాటిగా ఒకే థియేటర్లో స్క్రీనింగ్ అయిన అత్యంత అరుదైన ఫీట్‌ను (730 రోజులు) మగధీర నమోదు చేయడం విశేషం.
గీతాఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బీవీఎస్ఎన్ ప్రసాద్ రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. బాక్సాఫీస్ రూ.128 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి, దేవ్‌గిల్, సునీల్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
’15’Years for all time fav movie #Magadheera 🔥✨🙌🏻
Reply/Quote your fav frames.#RamCharan #KajalAggarwal pic.twitter.com/EL1NCGOfWN
— Siva Harsha (@SivaHarsha_23) July 30, 2024
#Magadheera Final Box Office Collection :-
Andhra & Nizam : ₹94.15 Cr
Karnataka : ₹11.10 Cr
Tamilnadu : ₹8.50 Cr
Kerala : ₹1.50 Cr
Rest of India : ₹1.20 Cr
Overseas : ₹16.20 Cr / $2.81 MnTotal Worldwide Gross : ₹132.65 Cr#15YearsForMagadheera pic.twitter.com/pCgiGumPBX
— Box Office – South India (@BoxOfficeSouth2) July 30, 2024
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్
Mani Ratnam | అఫీషియల్.. కమల్‌హాసన్-మణిరత్నం థగ్ లైఫ్ టీంలోకి మరో ఇద్దరు యాక్టర్లు
Shah Rukh Khan | చికిత్స కోసం యూఎస్‌కు షారుఖ్‌ఖాన్..!
Thug life | డబ్బింగ్ స్టూడియోలో కమల్‌హాసన్.. థగ్ లైఫ్ టీం కొత్త వార్త ఇదే..!