Game Changer | టాలీవుడ్ సినీ జనాలతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి గేమ్‌ఛేంజర్ (Game changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ భామ కియార అద్వానీ వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కియారా అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త లుక్ ఒకటి షేర్ చేశారు మేకర్స్. కియారా అద్వానీ బార్బీడాళ్లా కలర్ఫుల్గా మెరిసిపోతున్న ఈ లుక్ జరగండి జరగండి పాటలోనిది అని పోస్టర్‌తో తెలిసిపోతుంది.
ఈ స్టిల్ ఇప్పుడు నెటిజన్లను ఇంప్రెస్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీకి ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన జరగండి జరగండి పాట నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ సాంగ్‌లో రాంచరణ్, కియారా అద్వానీ కలర్ ఫుల్ డ్యాన్స్‌కు అభిమానులు ఫిదా అయిపోవడం గ్యారంటీ అని చెప్పకనే చెబుతున్నాయి విజువల్స్.
గేమ్‌ఛేంజర్‌లో సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో రాంచరణ్ కథానుగుణంగా తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడని తెలుస్తోండగా.. తండ్రి పాత్రకు జోడీగా అంజలి కనిపించనుందని ఇన్సైడ్ టాక్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తుండగా.. పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తున్నాడు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
Team #GameChanger wishes our Jabilamma Aka @advani_kiara a very Happy Birthday ❤️
Her vibrant energy will soon enchant your hearts 💥
Mega Powerstar @AlwaysRamCharan @shankarshanmugh @MusicThaman @DOP_Tirru @artkolla @SVC_official @ZeeStudios_ @zeestudiossouth @saregamaglobal… pic.twitter.com/PJMkzLTX4y
— Sri Venkateswara Creations (@SVC_official) July 31, 2024
People Media Factory | రాజాసాబ్.. మిస్టర్ బచ్చన్.. లీడింగ్ బ్యానర్ లైనప్‌లో క్రేజీ చిత్రాలు
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్