They Call Him OG | టాలీవుడ్ స్టార్ యాక్టర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawankalyan) అభిమానులు సినిమా షూటింగ్స్ అప్డేట్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏపీ ఎన్నికలు, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో సినిమా షూటింగులకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు పవన్ కల్యాణ్. కొన్ని అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టేందుకు మూడు నెలల తర్వాతే మేకప్ వేసుకుంటానని చెప్పారు.
ఇక అభిమానుల నిరీక్షణకు తెర పడిందా..? అంటే అవుననే చెబుతున్నాయి నెట్టింట వస్తున్న కథనాలు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం సుజిత్ డైరెక్షన్లో ఓజీ (They Call Him OG) , హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్లో ఓజీతోపాటు హరిహరవీరమల్లు సినిమాలు చేస్తున్నాడని తెలిసిందే. వీటిలో మొదట చిత్రీకరణలో పాల్గొనబోయేది ఓజీయేనని ఇన్సైడ్ టాక్. తాజా టాక్ ప్రకారం పవన్ కల్యాణ్ సెప్టెంబర్‌లో మళ్లీ మూవీ లవర్స్, ఫ్యాన్స్ కోసం మేకప్ వేసుకోబోతున్నాడట. దీనిపై మేకర్స్ నుంచి ఏం క్లారిటీ లేకున్నా ఈ వార్తలను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మేకర్స్.
డిప్యూటీ సీఎంగా బాధ్యతలున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ పెండింగ్‌లో ఉన్న సినిమాల కోసం రెండు నెలలు సమయం ఇవ్వనున్నాడని ఇప్పటికే ఫిలింనగర్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి మేకప్ వేసుకునేది నిజమే అయితే పవన్ కల్యాణ్ ఓ వైపు ప్రజా ప్రతినిధిగా, మరో వైపు యాక్టర్‌గా తన విధులను ఎలా బ్యాలెన్స్ చేస్తాడన్నది ఆసక్తికంగా మారింది.
మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ఉస్తాద్భగత్ సింగ్ గ్లింప్స్‌తోపాటు ఓజీ Hungry cheetah వీడియో అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. మరోవైపు పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లులో పవర్ స్టార్ నయా అవతార్‌లో కనిపించబోతున్నట్టు టీజర్క్లారిటీ ఇచ్చేస్తుంది. మొత్తానికి అభిమానులను ఖుషీ చేసేందుకు వరుస షూటింగ్స్‌కు రెడీ అవుతున్నాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది.
People Media Factory | రాజాసాబ్.. మిస్టర్ బచ్చన్.. లీడింగ్ బ్యానర్ లైనప్‌లో క్రేజీ చిత్రాలు
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్