IBomma Ravi | ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అతని బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇటీవల నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ఈ బెయిల్ పిటిషన్లపై బుధవారం నాడు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తాను హైదరాబాద్ వదిలి వెళ్లనని.. పోలీసు విచారణకు సహకరిస్తానని రవి కోర్టుకు తెలిపారు. ఇకపై పైరసీ చేయనని మొరపెట్టుకున్నాడు. మరోవైపు కేసు దర్యాప్తు దశలో ఉన్నదని పోలీసులు కోర్టుకు తెలిపారు. అలాగే ఇమ్మడి రవికిరవికి పలు దేశాల్లో పౌరసత్వం ఉందని.. బెయిల్ ఇస్తే విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఐబొమ్మ రవి అభ్యర్థనను తోసిపుచ్చింది. ఐదు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. ఆ బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.