గుడిపల్లి, మార్చి 4 : త్రీఫేజ్ కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం అంగడిపేట విద్యుత్తు సబ్ స్టేషన్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గుడిపల్లి మండలం చిల్కమర్రి, రోళ్లకల్ ఫీడర్‌కు సంబంధించి పది రోజులుగా త్రీఫేజ్ కరెంటు రావడం లేదని ఆరోపించారు. దీంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఫోన్ ద్వారా ఏడీ, ఏఈలకు ఫిర్యాదు చేయగా, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.