Buddy | టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ (Allu Sirish) నటిస్తోన్న యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ బడ్డీ (Buddy). సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తమిళ్లో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్‌గా వస్తున్న బడ్డీ ఆగస్టు 2న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన బడ్డీ ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో (Buddy First Glimpse) నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ చిత్రంలో అల్లు శిరీష్‌తోపాటు టెడ్డీబేర్ లీడ్ రోల్లో కనిపిస్తుందని తెలిసిందే.
ఇంతకీ టెడ్డీబేర్ రూపంలో వినోదాన్ని అందించే యాక్టర్ ఎవరనే సస్పెన్స్‌కు తెరదించారు మేకర్స్. తమిళ్ వెర్షన్లో నటించిన టెడ్డీ గోకుల్ మరోసారి అల్లు శిరీష్‌తో టెడ్డీబేర్ గెటప్‌లో సందడి చేయబోతున్నాడని ప్రకటించారు. అల్లు శిరీష్, టెడ్డీతో కలిసి సరికొత్తగా వినోదాన్ని అందించబోతున్నాడని అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని ఎక్కువ మంది వీక్షించేలా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.99, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.125 కే వీక్షించే అవకాశం కల్పించారని తెలిసిందే.
రౌడీ గ్యాంగ్ టెడ్డీని చంపేందుకు ప్రయత్నించే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. టెడ్డీ మనుషుల్లా ప్రవర్తించడం.. రౌడీలు టెడ్డీని టార్గెట్ చేయడం.. అల్లు శిరీష్ టెడ్డీని కాపాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నాడనే అంశాల చుట్టూ సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటిదాకా వచ్చిన రషెస్ చెబుతున్నాయి. బడ్డీలో అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ముఖేశ్ కుమార్, మహ్మద్ అలీ, ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బడ్డీకి హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేళ్ రాజా సమర్పణలో ఆధన జ్ఞానవేళ్ రాజాతో కలిసి నిర్మిస్తున్నారు.
The fantastic team of #Buddy is thrilled for the release, radiating confidence at The Grand Pre-Release Press Meet of #Buddy 🧸🤩#BuddyFromAugust2
A @hiphoptamizha Musical 🎹 pic.twitter.com/b53leQupwp
— BA Raju’s Team (@baraju_SuperHit) July 31, 2024
Original #Teddy #Gokul@arya_offl @sayyeshaa @ShaktiRajan pic.twitter.com/e3MUhcflAi
— Actor Kayal Devaraj (@kayaldevaraj) March 18, 2021
Double iSmart | మాస్క్ లేకుంటే నీకు మిండెడు కనపడ్తడు.. డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో రామ్ డబ్బింగ్
Game Changer | బర్త్ డే గాళ్ కియారా అద్వానీకి శుభాకాంక్షలు.. ట్రెండింగ్‌లో గేమ్ ఛేంజర్ నయా లుక్
They Call Him OG | ఏంటీ పవన్ కల్యాణ్ మేకప్ వేసుకునే టైం వచ్చేసిందా..? ఓజీ షూట్‌పై క్రేజీ న్యూస్
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్