Lalu Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Yadav) మనవడు ఆదిత్య మిలిటరీలో జాయిన్ అవుతున్నారు. సింగపూర్ (Singapore)లో ఆయన సైనిక శిక్షణకు (Military Training) బయల్దేరాడు. రెండేండ్ల పాటూ బేసిక్ మిలిటరీ శిక్షణ (Basic Military Training) తీసుకోనున్నాడు.
ఈ విషయాన్ని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) ఎక్స్ వేదికగా వెల్లడించారు. రెండేండ్ల పాటూ సాగే ఈ శిక్షణలో ఫిజికల్ ట్రైనింగ్‌తో పాటు వివిధ ఆయుధాల వినియోగంపై ప్రాథమిక శిక్షణ తీసుకోనున్నాడు ఆదిత్య. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వారిని రిజర్వ్ దళాలుగా వ్యవహరిస్తారు. కాగా, లాలూ కుటుంబం విడిపోయిన విషయం తెలిసిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రోహిణి ఆచార్య తన కుటుంబంతో అన్ని బంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక రోహిణి కుటుంబం సింగపూర్‌లో స్థిరపడిన విషయం తెలిసిందే.
Also Read..
Maoists | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. సుక్మా జిల్లాలో 26 మంది లొంగుబాటు
Ragging: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. ఇద్దరు సీనియర్ల సస్పెన్షన్
Karnataka: మహిళా కార్యకర్తపై దాడి చేసి దుస్తులు చింపేశారు.. కర్నాటక పోలీసుల దూకుడు