కారేపల్లి : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రిన్సిపాల్ ధారా సావిత్రి బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఐదవ తరగతిలో 80 సీట్లకుగాను 60 మైనార్టీలకు, 20 ఇతరులకు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ, బైపీసీలలో గ్రూప్‌కు 80 సీట్లకుగాను 60 మైనార్టీలకు, 20 ఇతరులకు కేటాయించారు.
అదేవిధంగా 6,7,8,9,10 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లను మొదటగా మైనారిటీలకు ప్రాధాన్యతనిస్తూ ఇతరులకు అవకాశం కల్పించబడుతుందని చెప్పారు. ప్రవేశాల కోసం విద్యార్థులు నేరుగా పాఠశాల/కళాశాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9704770360 (ప్రిన్సిపల్), 7995057902 (పాఠశాల) ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.