Nandamuri Balakrishna | తెలుగు ప్రేక్షకులతోపాటు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్బీకే 109 (NBK109). ఈ చిత్రానికి (Bobby) బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్లో వన్ ఆఫ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుత్ను బాబీ పుట్టినరోజు జరుపుకుంటున్నాడని తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్బీకే 109 షూటింగ్ లొకేషన్లో బాబీతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేసింది బాలకృష్ణ అండ్ బాబీ డియోల్ టీం .
ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్‌లో మాన్స్టర్ వచ్చేశాడు.. అంటూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు బాబీ. తాజాగా షూటింగ్ లొకేషన్ వీడియోతోపాటు బీటీఎస్ స్టిల్స్‌ను మేకర్స్ షేర్ చేయగా.. సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తూ.. అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని చెప్పకనే చెబుతోంది బాబీ టీం. ఇంకా టైటిల్ ఫైనల్ కానీ ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. మాస్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పోలీసాఫీసర్‌గా కనిపించబోతుంది ఊర్వశి రౌటేలా. కలర్‌ఫొటో ఫేం చాందినీ చౌదరి కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది. జాలి.. దయ కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు.. అంటూ గ్లింప్స్‌లో సాగుతున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. మరోవైపు బాలయ్య చేతిలో గొడ్డలి పట్టుకొని జీపులో నుంచి దిగుతున్నట్టుగా ఉన్న విజువల్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచుతున్నాయి.
ఎన్బీకే 109 బీటీఎస్ స్టిల్స్..
షూట్ లొకేషన్లో ఇలా..
Happy birthday @dirbobby anna 🔥🔥🔥
Can’t wait to witness the madness you have created for #NBK109 🔥@SitharaEnts @vamsi84 #NandamuriBalakrishna pic.twitter.com/ccBlOMDFSD
— NBK Cult 🦁 (@iam_NBKCult) August 1, 2024
Thangalaan | తుఫాను వచ్చేస్తుంది.. విక్రమ్ తంగలాన్ అడ్వెంచరస్ రైడ్‌కు రెడీనా..?
NBK 109 | షూటింగ్ స్పాట్లో బాబీ.. బాలకృష్ణ ఎన్బీకే 109 డైరెక్టర్‌కు బర్త్ డే విషెస్
Buddy | ఇంతకీ అల్లు శిరీష్ బడ్డీలో టెడ్డీబేర్ పాత్రలో నటించిందెవరో తెలుసా..?