Thangalaan | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తోన్న ఆసక్తికర సినిమాల్లో ఒకటి తంగలాన్ (Thangalaan). హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగే ఘటనల నేపథ్యంలో విక్రమ్ థ్రిల్లింగ్, అడ్వెంచరస్ రైడ్‌గా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఆగస్టు 15న తెలుగు,తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ తుఫాను వచ్చేస్తుంది.. తంగలాన్ నెల షురూ అయింది. విక్రమ్ అడ్వెంచరస్ రైడ్‌కు రెడీగా ఉన్నారా..? అంటూ కొత్త లుక్ విడుదల చేశారు. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తంగలాన్ నుంచి రిలీజ్ చేసిన విక్రమ్, మాళవికా మోహనన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తున్నాయి. ఈ మూవీ బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథగా అడ్వెంచరస్ స్టోరీ నేపథ్యంలో ఉండనుందని ఇప్పటికే లాంఛ్ చేసిన తంగలాన్ గ్లింప్స్ చెబుతోంది.
A storm is on its way 🔥 The #Thangalaan month begins!
Get ready for an adventurous ride 🌋#ThangalaanFromAug15@Thangalaan @chiyaan @beemji @GnanavelrajaKe #StudioGreen @OfficialNeelam @parvatweets @MalavikaM_ @gvprakash @NehaGnanavel @Dhananjayang @KvnProductions… pic.twitter.com/0uVehbNiUC
— Studio Green (@StudioGreen2) August 1, 2024
Buddy | ఇంతకీ అల్లు శిరీష్ బడ్డీలో టెడ్డీబేర్ పాత్రలో నటించిందెవరో తెలుసా..?
తంగలాన్ ట్రైలర్..