Rashmika Mandanna | కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చి తెలుగుతోపాటు ఇండియావైడ్‌గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అతికొద్ది మంది భామల్లో టాప్‌లో ఉంటుంది రష్మిక మందన్నా (Rashmika Mandanna). పుష్ప ది రైజ్ సినిమాతో శ్రీవల్లి పాత్రలో కోట్లాదిమంది మనసు దోచేసిన ఈ నేషనల్ క్రష్‌కు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేసే టాలెంట్ రష్మిక సొంతమనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఢిల్లీలో జరిగే ఈవెంట్‌కు వెళ్లిన సందర్భంలో రష్మిక మందన్నా వ్యవహరించిన తీరు అభిమానులను ఫిదా చేస్తుంది. రష్మిక చిత్రాన్ని గీసిన ఓ అభిమాని ఆమెను కలిసే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఆ అభిమానిని తోసేయడమే కాదు.. తను వేసిన స్కెచ్‌ను నలపడంతో ఏడ్చేశాడు అభిమాని. ఈ విషయాన్ని గమనించిన రష్మిక వెంటనే ఆ అభిమాని పిలిచి అందరి ముందు అతడి కోరిక మేరకు ఆ పెయింటింగ్‌పై తన సంతకం చేసింది రష్మిక . తన అభిమాని పట్ల రష్మిక చూపించిన ప్రేమకు అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.
రష్మిక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. వీటిలో ఒకటి అల్లు అర్జున్ పుష్ప ది రూల్. ది గర్ల్‌ఫ్రెండ్, కుబేర, యానిమల్ 2 కూడా రష్మిక ఖాతాలో ఉన్నాయి.
We want to share an incident from @iamRashmika’s visit to Delhi yesterday. During a press conference, a fan approached #RashmikaMandanna to show her a sketch he had made. Unfortunately, security guards pushed him roughly and crushed his sketch, making him cry 🥺 When Rashmika… pic.twitter.com/Agp4hO9aJj
— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) August 1, 2024
Thangalaan | తుఫాను వచ్చేస్తుంది.. విక్రమ్ తంగలాన్ అడ్వెంచరస్ రైడ్‌కు రెడీనా..?
NBK 109 | షూటింగ్ స్పాట్లో బాబీ.. బాలకృష్ణ ఎన్బీకే 109 డైరెక్టర్‌కు బర్త్ డే విషెస్
Buddy | ఇంతకీ అల్లు శిరీష్ బడ్డీలో టెడ్డీబేర్ పాత్రలో నటించిందెవరో తెలుసా..?